వీడియో: నా జాగా తీసుకున్నరు.. మరి ఆ సంగతేమైంది సారూ?

8 Jun, 2023 11:03 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: తనకు ఇచ్చిన హామీ నెరవేర్చడంలో జాప్యం ప్రదర్శిస్తున్న అధికారుల తీరుపై ఓ వ్యక్తి వినూత్న రీతిలో అసహనం ప్రదర్శించాడు. అది అలాఇలా కాదు.. ఏకంగా ఆ ఊరి సబ్‌స్టేషన్‌కే తాళం వేసి!. పైగా భార్యాపిల్లలతో పాటు ఆ సబ్‌స్టేషన్‌ ముందు నిరసన చేపట్టాడు. ఖమ్మంలోని రఘునాథపాలెం మండల పరిధిలోని బావోజి తండాలో ఇది చోటు చేసుకుంది. 

బావోజి తండాకు చెందిన తేజవత్ మహేందర్ గతంలో తమ ఊరి సబ్‌స్టేషన్‌ నిర్మాణం కోసమని తన భూమిని ఇచ్చాడు. అయితే.. తమ కుటుంబంలో ఒకరికి పర్మినెంట్‌ జాబ్‌ ఇస్తామనే హామీ మేరకు అతని ఆ భూమిని అప్పగించాడట. ఈ క్రమంలో అధికారులు  ఆ హామీ నెరవేర్చకపోవడంతో అలా తాళం వేశాడట. అంతేకాదు.. తన ఇద్దరు కూతుళ్లు, భార్యతో కలిసి ఆ గేటు ముందు నిల్చుని నిరసన చేపట్టాడు. ఊరి కోసం తన భూమిని ఇచ్చానని, కానీ, ఇప్పుడు కుటుంబ పోషణ భారం కావడంతోనే తాను ఈ పనికి దిగాల్సి వచ్చిందని అంటున్నాడతను. అయితే.. 

అధికారులు మాత్రం మరోలా స్పందించారు. మహేందర్‌కు కాంట్రాక్ట్‌ ఉద్యోగం ఇచ్చామని చెబుతున్నారు. అంతేకాదు.. గతంలోనూ మహేందర్‌ ఓసారి ఇలాగే గేటుకు తాళం వేశాడని, అప్పుడు మాట్లాడి తాము అతన్ని శాంతిపజేశామని అంటున్నారు.

మరిన్ని వార్తలు