హయత్‌నగర్ రాజేశ్ మృతి కేసులో వీడిన మిస్టరీ.. పోలీసులు ఏం చెప్పారంటే!

1 Jun, 2023 15:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంచలనం రేపిన హయత్ నగర్ రాజేశ్ మృతి కేసును పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. రాజేశ్‌, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సుజాత ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు రాచకొండ సీపీ చౌహన్‌ గురువారం మీడియా ముందు వివరాలు వెల్లడించారు. తొలుత సుజాత ఆత్మహత్యాయత్నం చేసుకొని ఆస్పత్రిలో మృతి చెందింది. తరువాత రాజేశ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. రాజేశ్‌, సుజాతకు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆధారాలు సేకరించినట్లు పేర్కొన్నారు.

‘రాజేశ్‌కు ఆరు నెలల క్రితం సామాజిక మాధ్యమంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో పరిచయం ఏర్పడింది. సోషల్‌ మీడియాలో ఆమె ఫొటోలు చూసి వివాహం కాలేదని భావించిన రాజేశ్‌.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కొంతకాలంగా వీరిద్దరూ తరచూ కలుసుకుంటున్నారు. రాజేష్ ప్రతి రోజు సుజాత ఇంటి చుట్టూ తిరిగేవాడు. సుజాతతో రాజేశ్‌ బాగా చనువుగా ఉండేవాడు. ఆమె తన పర్సనల్‌ ఫోటోలను రాజేశ్‌కు పంపింది.
సంబంధిత వార్త: మిస్డ్‌ కాల్‌తో కనెక్టయ్యారు.. లవ్‌లో మునిగితేలారు.. చివరకు..

అయితే సుజాత సంబంధం గురించి ఆమె కొడుకు జయచంద్రకు తెలిసింది. జయచంద్ర రాజేష్‌ను కొట్టాడు. కానీ అతనికి మృతికి ఈ గాయాలు కారణం కాదు. రాజేశ్‌ పోస్టుమార్టం రిపోర్టులో ఎలాంటి గాయాలు లేదు. ఈ క్రమంలో చనిపోదామని ఇద్దరూ నిర్ణయించారు. మే 24న సుజాత మొదట పురుగుల తాగింది. తన తల్లి చావు బతుకుల మధ్య ఉందని సుజాత కొడుకు రాజేశ్‌కు చెప్పాడు. అదే రోజు (మే 24) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఈ కేసుని చేధించాం. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది’ అని తెలిపారు.
చదవండి: ట్రైన్‌ ఎక్కుతూ జారిపడిపోయిన మహిళ.. రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో ఇరుక్కుపోయి

మరిన్ని వార్తలు