Hyderabad Rains:హైదరాబాద్‌లో భారీ వర్షం..జీహెచ్‌ఎంసీ అప్రమత్తం!

24 Jun, 2023 04:48 IST|Sakshi

హైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాదాపూర్, కొండాపూర్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్ పేట్, ఎస్‌ఆర్‌ నగర్, కూకట్‌పల్లిలో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో నగరవాసులను జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  అత్యవసరమైతే డీఆర్‌ఎఫ్ బృందాల సహాయం కోరకు 040-29555500కు కాల్ చేయాలని అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు