రానున్న ఐదు రోజులు వడగాల్పులే.. యెల్లో అలర్డ్ జారీ..

5 Jun, 2023 17:33 IST|Sakshi

హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా  42°C నుంచి 44°C వరకు  స్థిరంగా నమోదవుతాయని పేర్కొంది. హైదరాబాద్‌తో సహా చుట్టుపక్కల జిల్లాల్లో   39°C నుంచి 41°C వరకు నమోదవుతాయని స్పష్టం చేసింది. వడగాలల నేపథ్యంలో పలు జిల్లాలకి వాతావరణశాఖ  యెల్లో అలెర్ట్ జారీ చేసింది.  ఈ రోజు.. రేపు ఖమ్మం ,నల్గొండ,సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్  జిల్లాల్లో  వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. వడగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని  అధికారులు కోరారు.

రాగల మూడు రోజులు కొన్ని జిల్లాల్లో  తేలికపాటి  ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులతో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ చత్తీస్‌గఢ్‌  మీదుగా అవర్తనం  కొనసాగుతోందని వెల్లడించింది. ఉత్తర చత్తీస్‌గఢ్  నుంచి విదర్భ మీదుగా తెలంగాణ  వరకు ద్రోణి విస్తరించిందని పేర్కొంది. 

ఇదీ చదవండి:విషాదం: ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు చిన్నారులు మృతి..

మరిన్ని వార్తలు