వెయ్యేళ్ల లక్ష్మీదేవి ఆలయం

3 Jun, 2023 11:11 IST|Sakshi

స్టేషన్‌ఘన్‌పూర్‌: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం ఇప్పగూడెం గ్రామ శివారులోని పురాతన నాగులమ్మ దేవాలయంలో దాదాపు వెయ్యేళ్లనాటి లక్ష్మీదేవి ఆలయం వెలుగుచూసింది. ఈ మేరకు తను గుర్తించిన పలు విషయాలను చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి శుక్రవారం వివరించారు. ‘కాకతీయుల కాలంలో నిర్మించిన నాగుల­మ్మ గుడిలో ద్వికూటాలయానికి మరమ్మతులు చేస్తున్నారు.

గుడిచుట్టూ మట్టిని తొలగిస్తుండగా సూ­ర్యుడి విగ్రహం, 13వ శతాబ్దం నాటి శిలాశాస­నం బయటపడ్డాయి. ఆ శాసన పాఠం అచ్చుతీసి శాసన పరిష్కర్త కె.మునిరత్నంనాయుడు, ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా మైసూర్‌కు పంపించగా పూర్తి వివరాలు తెలిశాయి. సుమారు ఐదడుగుల ఎత్తైన ఏకశిలపై రాసిన శాసనంలో.. కాకతీయుల కాలంలోని మహాప్రధాని లక్ష్మీదేవికి రంగ¿ోగాలకు భూమిని దానం చేసినట్లు తెలిసింది. ఆ శాస­నంపై ‘తుసము, దునెనిమిదిసమ, గూతి శ్రీలక్ష్మీ, రంగ¿ోగలకు, విచ్చితి, మహాప్ర«దాని, క్రయమాత, ముక్య, నానకు’ అనే పదాలు ఉన్నాయని తెలిపారు. 

ఇటుకల తయారీలో ఇంజనీరింగ్‌ నైపుణ్యం  
ఇక్కడి ఇటుకల్లో అద్భుతమైన ఇంజనీరింగ్‌ నైపుణ్యం ఉందని, మట్టి, డంగు సున్నం లేకుండా తయారు చేశారని తెలిపారు. ఆల­యం ముందున్న పాటిగడ్డ మీద శాతవాహనుల కాలం నాటి రుబ్బు రోలు లభించిందని, అక్కడే కాకతీయుల కాలం నాటి శిథిల దేవాలయం ఆనవాళ్లు కనిపించాయని తెలిపారు. 

మరిన్ని వార్తలు