సాయం పేరుతో రాత్రివేళల్లో చాటింగ్, వీడియో కాల్స్‌.. బీఆర్‌ఎస్‌ నేతపై మహిళ ఆరోపణలు

21 Jun, 2023 21:27 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల పట్టణ బీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు బింగి ప్రవీణ్‌ సాయం చేస్తానంటూ మాటలు కలిపి మోసం చేసేందుకు ప్రయత్నించాడని ఓ మహిళ మంగళవారం మంచిర్యాల పోలీసులను ఆశ్రయించింది. ప్రవీణ్‌ నివాసం ఉంటున్న కాలనీలోనే తాను భర్తతో కలసి ఉంటున్నట్లు పేర్కొంది. తమ మధ్య ఉన్న గొడవను ప్రవీణ్‌ అనుకూలంగా మలుచుకునేందుకు ఓవైపు తన భర్తతో, మరోవైపు తనతో సన్నిహితంగా ఉంటూ పోలీసులు తెలుసంటూ మోసం చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించింది.

అధికార పార్టీ నేత కావడంతోనే పోలీసులు సైతం ప్రవీణ్‌ చెప్పినట్లు చేయడం, దీనిని ఆసరాగా చేసుకొని తనకు అర్ధరాత్రి వరకు వాట్సాప్‌లో చాటింగ్, వీడియో కాల్స్‌ చేస్తున్నాడని ఆరోపణలు చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారని మహిళ వివరించింది. ఈ విషయమై బింగి ప్రవీణ్‌ను సంప్రదించగా తన ఇంటి సమీపంలోనే భార్యాభర్తలు ఉంటారని, సాయం చేయాలని కోరితేనే భార్యాభర్తలకు తన వంతు సాయం చేసేందుకు ప్రయత్నించానన్నారు. మహిళ లేనిపోని ఆరోపణలు చేస్తోందన్నారు.  
చదవండి: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్‌ నవ్య ఎపిసోడ్‌లో కీలక ట్విస్ట్‌


     

>
మరిన్ని వార్తలు