అమెరికాలో 1.99 లక్షల మంది భారతీయ విద్యార్థులు

17 Nov, 2022 14:49 IST|Sakshi
ఇండో గ్లోబల్‌ స్టడీస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ కార్యాలయాన్ని సందర్శించిన అమెరికా రోవాన్‌ యూనివర్సిటీ సీనియర్‌ వీసీ డారెన్‌ వాగ్నర్‌

సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చదుకునేందుకు భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా గణనీయంగా పెరుగుతోందని అమెరికా రోవాన్‌ యూనివర్శిటీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డారెన్‌ వాగ్నర్‌ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని స్కైవ్యూలోని ఇండో గ్లోబల్‌ స్టడీస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ కార్యాలయాన్ని ఆయన గ్లోబల్‌ స్టూడెంట్‌ రిక్రూట్‌మెంట్‌ అడ్వైజర్‌ సీఈఓ డాక్టర్‌ మార్క్‌ ఎస్‌ కోపెన్క్సి, ఐజీఎస్‌ వ్యవస్థాపకుడు చైర్మన్‌ అశోక్‌ కల్లం కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతదేశం నుంచి ఏడాది 18.9 శాతం విద్యార్థుల పెరుగుదల కనిపిస్తోందని, ప్రస్తుతం అమెరికాలో 1.99 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారన్నారు. ప్రస్తుతం 80 శాతం విద్యార్థులు గ్రాడ్యుయేషన్, 20 శాతం అండర్‌ గ్రాడ్యుయేషన్‌కు వెళ్ళుతున్నారని, 78 శాతం విద్యార్థులు స్టెమ్‌ ప్రోగ్రామ్‌లను తీసుకుంటున్నారన్నారు. 

ప్రస్తుతం అమెరికాలో 1.6 మిలియన్‌ ఉద్యోగాలు ఉన్నాయన్నారు. రోవాన్‌ విశ్వవిద్యాలయం 800 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రభుత్వ సంస్థ అని దీన్ని 1923లో స్థాపించారని ఆయన గుర్తు చేశారు. అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మూడవ విశ్వవిద్యా లయంగా గుర్తింపు సాధించిందన్నారు. అనంతరం నూతన అడ్మిఫన్ల ప్రక్రియపై వారు చర్చించారు. (క్లిక్‌ చేయండి: సాఫ్ట్‌వేర్‌ కొలువు.. ఇక సో ఈజీ!)

మరిన్ని వార్తలు