నవరాత్రి ఉత్సవాలు; కోటి రూపాయలతో అలంకరణ

26 Oct, 2020 15:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో సందరంగా అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్నికల్పించారు. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల్లో భాగంగా జోగులాంబ గద్వాల్‌లోని వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో దుర్గమాతను కరెన్సీ నోట్లతో అలంకరించారు. వీటి విలువ అక్షరాలా కోటీ రుపాయలు. భారతీయ‌ కరెన్సీ నోట్లను కాగితపు పువ్వులలాగా తయారు చేసి వాటిని దుర్గమాతకు సమర్పించారు. 10,20, 100,200,500 వంటి వివిధ రకాల నోట్లతో దండలు, పుష్పగుచ్ఛాలుగా తయారు చేసి మొత్తం 1,11,11,111 రూపాయలను ధనలక్ష్మీ అవతారంలో అమ్మవారికి అలంకరించారు. చదవండి: రానా, మిహికల మొదటి దసరా వేడుకలు

దీనికి సంబంధించిన వీడియోను ఉమ సుధీర్‌ అనే మహిళ జర్నలిస్టు ట్విటర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా కోటి రుపాయల మొత్తాన్ని ఇలా అమ్మవారికి సమర్పించడం భక్తులు ఆశ్చార్యానికి లోనవుతున్నారు. అయితే మూడేళ్ల క్రితం అదే ఆలయంలో అమ్మవారికి 3,33,33,333 కోట్ల రూపాయల విలవైన కరెన్సీని ఉపయోగించి అలంకరించారు. రెండేళ్ల క్రితం కిలో బంగారుకిరీటం కూడా సమర్పించారు. కానీ ఈ ఏడాది కోవిడ్‌ కారణంగా కొంచెం తక్కువ మొత్తంలో అమ్మవారిని అంకరించినట్లు తెలుస్తోంది. చదవండి: శక్తికి యుక్తిని జోడించి ముందుకు..

మరిన్ని వార్తలు