అరుదైన వ్యాధితో బాధపడుతున్న 10 నెలల చిన్నారి.. సాయం చేసి ఆదుకోరూ..

27 Aug, 2022 20:11 IST|Sakshi

పైన ఫోటోలో కనిపిస్తున్న పాప పేరు హన్విక. ఆమె వయసు కేవలం 10 నెలలు. ఇంత చిన్న వయసులోనే పాప అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ప్రస్తుతం ఈ చిన్నారి డెంగ్యూ షాక్ సిండ్రోమ్‌, మల్టీ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్‌తో పోరాడుతోంది. పసిపాప పరిస్థితి అత్యంత దీనస్థితికి చేరుకుంది. ఆ పాప తల్లిదండ్రులు దీప్తి, రవి కిరణ్‌ హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.

కూతురు వైద్యం కోసం ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు చేశారు. అయినా పాప ఆరోగ్యం కుదుట పడకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తమ కూతురు  తీవ్రమైన ఇన్ఫనైట్‌ డెంగ్యూ, హైపర్‌ ఫెరిటినిమా, ట్రాన్స్‌మినిట్స్‌, కోగులోపతితో బాధపడుతోందని, దాతలు తోచిన సాయం చేసి, ఆదుకోవాలని ఆమె తండ్రి రవి కిరణ్‌ అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఉద్యోగం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాప పేరు: ఆర్‌ హన్విక
తండ్రి పేరు: రవి కిరణ్‌
తల్లి: దీప్తి
గూగుల్‌ పే నంబర్‌: 8019872446

బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు
అకౌంట్‌ నంబర్‌: 403901502892
బ్యాంక్‌ - ఐసీఐసీఐ, సేవింగ్స్‌ ఖాతా
ఖాతాదారుని పేరు:  ముసిలమ్మోళ్ల దీప్తి సాయి
ఐఎఫ్‌ఎస్‌ఈ కోడ్‌: ICIC0000008

మరిన్ని వార్తలు