కరోనా కిల్లర్ @103

18 Sep, 2020 04:20 IST|Sakshi

హఫీజ్‌పేట్‌(హైదరాబాద్‌): భయపడకుండా, తగిన జాగ్రత్తలతో ఎదుర్కొంటే కోవిడ్‌ను సులభంగా జయించవచ్చని నిరూపించాడు మరో శతాధిక వృద్ధుడు. నగరంలోని కొండాపూర్‌లో ఉన్న సీఆర్‌ ఫౌండేషన్‌ వృద్ధాశ్రమంలో పరుచూరి రామస్వామి (103) ఉంటున్నారు. కొన్ని రోజుల కిందట ఆయన కోవిడ్‌ బారిన పడ్డారు. వెంటనే చికిత్స కోసం ఆయన్ని నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అందించిన చికిత్సతో రామస్వామి కోలుకొని తిరిగి వృద్ధాశ్రమానికి క్షేమంగా చేరుకున్నారు. సీఆర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రామస్వామిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘కోవిడ్‌ చికిత్సకు ప్రభుత్వాసుపత్రులే అ త్యుత్తమం. ఫౌండేషన్‌లో 26 మందికి కోవిడ్‌ సోకింది. వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించడంతో వారు కోలుకున్నారు. మంత్రి ఈటల రాజేందర్‌కు కృతజ్ఞతలు’ అని చెప్పారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా