110 ఏళ్ల తాత... కరోనాపై విజేత

13 May, 2021 03:24 IST|Sakshi

‘గాంధీ’లో చికిత్స తర్వాత కోలుకున్న రామానందతీర్థ

కరోనాను జయించినవారిలో అత్యధిక వయసున్న వ్యక్తి ఇతడే అంటున్న వైద్యులు

సాక్షి, గాంధీ ఆస్పత్రి: బాబోయ్‌ కరోనా అంటూ యువతే బయపడుతున్న వేళ.. 110 యేళ్ల తాత ధైర్యంగా వైరస్‌ను జయించాడు. ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ వచ్చి కోలుకున్న వారిలో ఇత నే అత్యధిక వయస్కుడని వైద్యులు పేర్కొంటు న్నారు. గాంధీ ఆస్పత్రి సూపరింటిండెంట్‌ ప్రొ ఫెసర్‌ రాజారావు, నోడల్‌ ఆఫీసర్‌ ప్రభాకర్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన రామానందతీర్థ(110) గత నెల 24న కరోన పాజిటివ్‌తో గాంధీ ఆస్పత్రిలో చేరా రు. చికిత్స అనంతరం బుధవారం నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో కరోన నెగెటివ్‌ వచ్చింది.

ఆధ్యాత్మికవేత్త అయిన రామానందతీర్థ కొన్నే ళ్లపాటు హిమాలయాల్లో గడిపి.. పదేళ్ల క్రితం నగరానికి తిరిగివచ్చారు. ఎనిమిదేళ్ల క్రితం కీళ్ల సంబంధ సమస్యకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ సమయంలో ఆస్పత్రి గైనకాలజీ విభాగ హెచ్‌ఓడీ ప్రొఫెసర్‌ అనుపమ పరిచయ మయ్యారు. డిశ్చార్జీ అనంతరం రామానంద తీర్థకు ఆలయాల్లో ఆశ్రయం కల్పించి ఆర్థిక సాయం అందించేవారు. ఈ క్రమంలో కీసర ఆశ్రమంలో ఉంటున్న రామానందతీర్థకు కరో నా రావడంతో అనుపమ గాంధీలో చేర్చించా రు. చికిత్స తర్వాత ఆయన కోలుకున్నారు. కాగా, గాంధీ ఆస్పత్రి వైద్యులు తనకు పునర్జన్మ ప్రసాదించారని రామానందతీర్థ పేర్కొన్నారు. ఆయన మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉంటారని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.  చదవండి: (లాక్‌డౌన్‌: జనమంతా ఇళ్లలోనే!)

90 ఏళ్ల వృద్ధురాలు కూడా...
గాంధీ ఆస్పత్రిలోనే 90 ఏళ్ల వృద్ధురాలు కూడా కరోనాపై విజయం సాధించారు. పాజి టివ్‌ వచ్చిన ఐదు రోజుల్లోనే రికవరీ కావడం గమనార్హం. ముషీరాబాద్‌ బాకారం ప్రాంతానికి చెందిన పెంటమ్మ (90) కరోనాతో ఈనెల 7న గాంధీ ఆ స్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. చికిత్స అనంతరం పూర్తిస్థాయిలో కోలుకోవడంతో  ఆస్పత్రి అధికారులు బుధవారం డిశ్చార్జి చేశారు. 

మరిన్ని వార్తలు