సొరంగం అనుకుంటే పొరపాటే..

7 Jul, 2021 08:59 IST|Sakshi

జోగుళాంబ : చారిత్రక నేపథ్యం కలిగిన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో మంగళవారం భూగర్భంలో 12 అడుగుల లోతుతో ధాన్యం భద్రపరుచుకునే గది బయటపడింది. పట్టణంలో ఉబేద్‌ అనే వ్యక్తి పాడుబడిన ఓ దుకాణం గదిలో గిర్ని మిషన్‌ ఏర్పాటు చేసుకునేందుకు మేస్త్రీతో గొయ్యి తీయించగా బండ కనిపించింది. మూత తరహాలో ఉన్న ఆ బండను తెరిచి చూడగా.. దాదాపు 5 అడుగుల వెడల్పు, 12 అడుగుల లోతుతో సొరంగంలా కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అది సొరంగం కాదని, పూర్వం రోజుల్లో ధాన్యాన్ని భద్రపరిచేందుకు ఏర్పాటు చేసుకున్న గది అని ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి చెప్పారు.   

మరిన్ని వార్తలు