తెలంగాణలో కొత్తగా 1,436 కరోనా కేసులు

6 Jun, 2021 20:08 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. తగ 24 గంటల్లో 97,751 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 1,436 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

ఇక తాజాగా 14 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 3,378 కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 3,614 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 27,016 పాజిటివ్‌ కేసులు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది.

(చదవండి: అంతరించిదనుకుంటే.. 100 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రత్యక్షం)

మరిన్ని వార్తలు