వక్ఫ్‌ బోర్డు సభ్యుల స్థానాలకు 15 నామినేషన్లు 

18 Feb, 2022 01:34 IST|Sakshi

సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సభ్యుల ఎన్నిక కోసం మూడు కేటగిరిల్లో మొత్తం 15 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి,హైదరాబాద్‌ కలెక్టర్‌ శర్మన్‌ గురువారం తెలిపారు. ఎమ్మెల్యే, ఎమెల్సీ విభాగాల్లో మజ్లిస్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొయిద్దీన్, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

ముత్త్తవల్లీ, మేనేజింగ్‌ కమిటీ విభాగంలో మిర్జా అన్వర్‌ బేగ్, ఫిరాసత్‌ అలీ భక్షి, మన్వర్‌ హుస్సేన్, మిర్జా షేహెరియర్‌ బేగ్, సయ్యద్‌ అక్బర్‌ నిజామొద్దీన్‌ హుస్సేనీ, ముజఫ్ఫర్‌ అలీ సూఫీ, మహ్మద్‌ ఖైరుల్‌ హుస్సేన్, మసీహుర్‌ రహ్మన్‌ జాకీర్, జహీర్‌ అహ్మద్‌ ఖాన్, అబ్ధుల్‌ మజీద్, అబ్దుల్‌ ఫతహ్‌ సయ్యద్‌ బందగీ బద్‌షాఖాద్రీ నామినేషన్లు దాఖలు చేశారు. బార్‌ కౌన్సిల్‌ విభాగంలో ఎంఏ ముఖీద్, జాకీర్‌ హుస్సేన్‌ జావిద్‌లు నామినేషన్లను దాఖలు చేశారు. ఎంపీ విభాగంలో మాత్రం నామినేషన్‌ దాఖలు కాలేదు.  

మరిన్ని వార్తలు