కౌటాల కస్తూర్బా స్కూల్లో 15 మందికి అస్వస్థత

10 Sep, 2022 08:03 IST|Sakshi

కౌటాల (సిర్పూర్‌): కుమురంభీం జిల్లా కౌటాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 15 మంది విద్యార్థినులు అస్వస్థత బారినపడ్డారు. గురువారం సాయంత్రమే కొందరు విద్యార్థులు వాంతులు, తలనొప్పి, జ్వరం బారినపడ్డారు. శుక్రవారం నాటికి ఇలా అనారోగ్యానికి గురైనవారి సంఖ్య మరింత పెరిగింది. దీంతో 15 మందిని అంబులెన్స్‌లో కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వీరిలో తీవ్ర అనారోగ్యంగా ఉన్న నలుగురికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని.. మిగతా వారిని హాస్టల్‌కు తిరిగి పంపిస్తున్నామని వైద్యులు తెలిపారు. వైద్య సిబ్బంది విద్యాలయానికి వెళ్లి.. విద్యార్థులందరి నుంచి రక్త పరీక్షల కోసం నమూనాలు సేకరించారు. 
చదవండి: ఇంటర్ ఛేంజర్లకు అదనంగా భూసేకరణ

మరిన్ని వార్తలు