తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

26 Jul, 2020 12:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1593 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్‌ సోకి 8 మంది మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 54,059కి చేరింది. మృతుల సంఖ్య 463 మందికి పెరిగింది. ఇప్పటి వరకు 41,332 మంది వైరస్‌ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 12,264 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్‌లోనే 641 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి 171, వరంగల్ అర్బన్ 131, మేడ్చల్ - 91 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. (ఒక్కరోజులో 705 మంది మృతి)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు