వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు

27 May, 2021 17:59 IST|Sakshi

టీ-యాప్‌ ఫోలియో ద్వారా ఆన్‌లైన్‌ సేవలు

మొబైల్ ఫోన్ల నుంచి 17 రకాల సేవలు

హైదరాబాద్: వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రస్తుత కరోనా మహమ్మరి కారణంగా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి ఆన్‌లైన్‌ ద్వారా సేవలందించాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. మొత్తం 17 రకాల సేవలను ఆన్‌లైన్‌ ద్వారా అందించడానికి ‘ఎక్కడైనా - ఎప్పుడైనా (ఎనీవేర్‌ - ఎనీటైమ్‌)’ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనికోసం ఇప్పటికే రాష్ట్రంలో అందుబాటులో ఉన్న టీ-యాప్‌ ఫోలియో ద్వారా సేవలు అందించనున్నట్లు రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు బుధవారం తెలియజేశారు. 

పౌరులు తమ స్మార్ట్ మొబైల్ ఫోన్ల నుంచి 17 రకాల సేవలను యాక్సెస్ చేయవచ్చు అని ఈ సేవల కోసం రవాణా లేదా ఆర్టీఏ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదు అని అన్నారు. టీ-యాప్‌ ఫోలియో యాప్‌ను గూగుల్ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని అందులో పేర్కొన్న సేవల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రవాణా శాఖ కమిషనర్‌ తెలిపారు.

టీ-యాప్‌ ఫోలియో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని మొబైల్‌ నంబర్‌తో రిజిస్టర్‌ చేసుకొని తర్వాత మీకు కనిపించే ఆర్టీఏ ఐకాన్‌పై క్లిక్‌ చేస్తే 17 రకాల సేవలు కనపడుతాయి. అందులో మనకు అవసరమైన దానిపైన క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. డూప్లికేట్‌ లైసెన్స్‌, ఇష్యూ ఆఫ్‌ బ్యాడ్జ్‌, స్మార్ట్‌కార్డు, లైసెన్స్‌ హిస్టరీ షీట్‌, డూప్లికేట్‌ లెర్నర్‌ లైసెన్స్‌, డూప్లికేట్‌ పర్మిట్‌, పర్మిట్‌ రెన్యువల్‌, టెంపరరీ పర్మిట్‌ వంటి 17 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని కమిషనర్ తెలిపారు.

చదవండి: జూనియర్‌ డాక్టర్ల చర్చలు సఫలం..స్టైఫండ్‌ పెంపు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు