తెలంగాణలో కొత్తగా 1802 కేసులు 9 మరణాలు

7 Sep, 2020 09:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1802 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,42,771 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 895 కు చేరింది. తాజాగా 2711 మంది కోవిడ్‌ పేషంట్లు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,10,241.

యాక్టివ్‌ కేసుల సంఖ్య 31,635. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ సోమవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా రోగుల రికవరీ రేటు 77.25 శాతంగా ఉండగా.. తెలంగాణలో 77.2 శాతంగా ఉందని తెలిపింది. ఇక దేశంలో కరోనా మరణాల రేటు 1.70 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 0.62 శాతంగా ఉందని వెల్లడించింది. గత 24 గంటల్లో 36,593 వైరస్‌ నిర్ధారణ పరీక్ష చేశామని, మొత్తం పరీక్షల సంఖ్య 17,66,982 కు చేరిందని పేర్కొంది.
(చదవండి: కరోనా వచ్చి పోయిందేమో? )

>
మరిన్ని వార్తలు