కొత్తగా 1,802 కేసులు

8 Sep, 2020 04:31 IST|Sakshi

రాష్ట్రంలో తాజాగా 9 మంది మృతి.. 895కి చేరిన మరణాలు 

మొత్తం కోవిడ్‌ టెస్టులు 17.66 లక్షలు.. కేసులు 1.42 లక్షలు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఆదివారం 36,593 మందిని పరీక్షించగా.. 1,802 కొత్త కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం బులెటిన్‌లో వెల్లడించింది. ఇక ఇప్పటివరకు 17,66,982 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో మొత్తం 1,42,771 మందికి కరోనా సోకిందని పేర్కొంది. తాజాగా ఒక్కరోజే 9 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 895కి చేరింది. కొత్తగా 2,711 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,10,241 మందికి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 31,635 యాక్టివ్‌ కేసులున్నట్లు బులెటిన్‌లో తెలిపారు. అందులో 24,596 మంది ఇళ్లు లేదా ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. 

రాష్ట్రంలో కోలుకున్న వారి రేటు 77.2 శాతం..
ఇక రాష్ట్రంలో 10 లక్షల జనాభాకు 47,594 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. దేశంలో కరోనా నుంచి కోలుకున్నవారి రేటు 77.25 శాతముంటే, అదే తెలంగాణలో 77.2 శాతంగా ఉంది. ఇటు కరోనా మరణాల రేటు దేశంలో 1.70 శాతముంటే, తెలంగాణలో అది 0.62 శాతంగా ఉంది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 98,512 (69%) మందికి ఏ లక్షణాలు లేవని బులెటిన్‌లో పేర్కొన్నారు. తాజాగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 245 వచ్చాయి. ఇంకా రంగారెడ్డి జిల్లాలో 158, కరీంనగర్‌ జిల్లాలో 136, సిద్దిపేట జిల్లాలో 106, సంగారెడ్డి జిల్లాలో 103 కేసులు నమోదయ్యాయి. ఇటు 42 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 8,052 కరోనా పడకలుండగా, అందులో 2,689 నిండిపోయాయి. ఇంకా 5,363 ఖాళీగా ఉన్నాయి. అలాగే 196 ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో 10,299 కరోనా పడకలుండగా, వాటిల్లో 4,350 రోగులతో నిండిపోయాయి. ఇంకా 5,949 ఖాళీగా ఉన్నాయని బులెటిన్‌లో వివరించారు.

మరిన్ని వార్తలు