ప్రకృతి కాంత హోయలు.. రెండు హరివిల్లులు 

26 Jul, 2021 07:57 IST|Sakshi

సాధారణంగా ఆకాశంలో ఇంద్రధనస్సు ఒక సమయంలో ఒకటే ఏర్పడుతుంది. అయితే ఆదివారం నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ గ్రామ శివారులో రెండు ఇంద్రధనుస్సులు ఏర్పడ్డాయి. సాయంత్రం వేళ ఆకాశం మేఘావృతమై మోస్తరు వర్షం కురిసిన అనంతరం రంగుల హరివిల్లు ఇలా వెల్లివిరిసింది.   –ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌)  

పంటలను ముంచిన బ్యాక్‌వాటర్‌ 
మహదేవపూర్‌: మూడు రోజులుగా కురిసిన వర్షాలకు వచ్చిన వరదలతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం అబట్‌పల్లి వద్ద మేడిగడ్డ లక్ష్మీబ్యారేజ్‌లో 79 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో బ్యాక్‌వాటర్‌తో కొంగలవాగు, పెద్దంపేట వాగు ఉప్పొంగి సూరారం, పెద్దంపేట గ్రామాల్లోని దాదాపు 300 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. నష్టం అంచనా వేసి సాయం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. బ్యారేజీలో 94.80 మీటర్ల ఎత్తులో నీరు నిల్వ ఉందని, ప్రస్తుతం కురిసిన వర్షానికి 25,300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదుతున్నట్లు ఇంజనీరింగ్‌ అధికారులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు