23 నిమిషాల్లో 2005 కిక్స్.. బాలిక పవర్‌కు గిన్నిస్ రికార్డు దాసోహం

6 Sep, 2022 09:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 23 నిమిషాల్లో 2005 కిక్స్‌ కొట్టి... గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది హైదరాబా­ద్‌కు చెందిన శ్రీహాస. కోవిడ్‌ నేపథ్యంలో మైదానానికి దూరంగా ఉన్నా.. ఆన్‌లైన్‌లో శిక్షణ పొంది ఈ ఘనత సాధించింది. నగరంలోని సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన జేవీ శ్రీరామ్, పావనిల కూతురు జొన్నలగడ్డ వెంకట సాయి శ్రీహాస. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 13 ఏళ్ల వయసులోనే తైక్వాండోలో అత్యంత ప్రతిభ చూపిస్తోంది. ఏపీలోని ఈశ్వర్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ గ్రాండ్‌ మాస్టర్స్‌ ఈశ్వర్, విశ్వ దగ్గర శిక్షణ పొంది, గతంలో 20 నిమిషాల్లో 1400 ఫ్రీ కిక్స్‌ కొట్టింది. ఆ రికార్డును బద్దలు కొట్టాలని అహర్నిశలు సాధన చేసింది. ఇంటర్‌నెట్‌లో తైక్వాండో వీడియోలు చూసి మెళకువలు నేర్చుకుంది.

ఈ ఏడాది మే నెల్లో గిన్నిస్‌ రికార్డు బృందం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో నిమిషానికి ఒక సెట్‌ చొప్పన 23 సెట్లలో 2005 తైక్వాండో క్లిక్స్‌ కొట్టి శ్రీహాస కొత్త రికార్డు సృష్టించింది. రివ్యూ పూర్తయిన అనంతరం ఆదివారం కృష్ణాజిల్లా నాగాయలంకలోని అకాడెమీలో శ్రీహాసకు గిన్నిస్‌ రికార్డు సరి్టఫికెట్‌ను అందజేశారు. శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండలం నీలంపేట వీరి స్వస్థలం.
చదవండి: ఇంజనీరింగ్‌ విద్యార్థుల పేరెంట్స్‌కు బిగ్‌ షాక్‌..!

మరిన్ని వార్తలు