తెలంగాణలో కొత్తగా 2,175 కరోనా కేసులు

4 Jun, 2021 19:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,175 కరోనా కేసులు నమోదు కాగా.. 15 మరణాలు చోటుచేసుకున్నాయి. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య  5,87,664గా ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 3,346 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో కొత్తగా 3,821 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా.. మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 5,53,400గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,918 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

మరిన్ని వార్తలు