టీఎస్‌ బీపాస్‌తో సత్ఫలితాలు

18 Nov, 2022 02:17 IST|Sakshi
అవార్డులు అందజేస్తున్న అరవింద్‌ కుమార్‌ 

స్పెషల్‌ సీఎస్‌ అరవింద్‌ కుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్మాణ అనుమతుల కోసం రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన టీఎస్‌ బీపాస్‌ ప్రజల మన్ననలు పొంది, మంచి ఫలితాలు సాధించిందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ అన్నారు. టీఎస్‌ బీపాస్‌ అమల్లోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  ఆయన పాల్గొని, మాట్లాడారు. పథకం ప్రవేశపెట్టిన తొలి సంవత్సరంలో నిర్మాణ దరఖాస్తులకు అనుమ తులు 22 శాతం పెరిగాయన్నారు.

2022–23 ఆర్థిక సంవత్సరంలో 43,709 దరఖాస్తులకు అనుమతులు లభించినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు దారులకు స్వయం మదింపు విధా నాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు. 75 చ.గ. విస్తీర్ణంలో చేపట్టే గృహ నిర్మాణానికి అనుమ తులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ అక్కర లేదని, రూపాయి రుసుముతో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే సరిపోతుందని చెప్పారు. 600చ.గ. సంబంధించి సింగిల్‌ విండో విధానంలో అనుమ తులు లభిస్తాయని వివరించారు. ఈ సందర్భంగా పలువురికి అవార్డులు అందజేశారు.

మరిన్ని వార్తలు