23 నెలలకే ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు

11 Oct, 2022 02:00 IST|Sakshi

కమలాపూర్‌: 23 నెలల వయసులోనే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది ఓ చిన్నారి. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని ఉప్పల్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దివంగత ఆకినపెల్లి కృష్ణ మనుమరాలు శ్రేయాన్వి కృష్ణ వయస్సు రెండేళ్లు కూడా నిండలేదు. ఆమె తల్లిదండ్రులు శ్రావణి–సాయిరాం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు.

శ్రేయాన్వి తెలుగు పాటలు, పద్యాలు, శ్లోకాల పఠనంతోపాటు తెలుగు సినిమా నటీనటులు, స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను గుర్తించడం, రామాయణంలోని కథలు చెప్పడం, దేవుళ్ల పేర్లను గుర్తించడం, పజిల్స్‌ సాల్వ్‌ చేయడం, ఇంగ్లిష్‌ రైమ్స్‌ వంటివి చెబుతూ అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. తల్లిదండ్రులు.. చిన్నారి వీడియోలను ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వారికి పంపించారు. ఆమె ప్రతిభను గుర్తించి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు కల్పించి గోల్డ్‌ మెడల్, ప్రశంసాపత్రం పంపించారు.  

మరిన్ని వార్తలు