‘ఆరోగ్యశ్రీ’లో 25 లక్షల శస్త్రచికిత్సలు

23 Sep, 2022 04:21 IST|Sakshi

వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: ఆయుష్మాన్‌ భారత్‌ పథకంతో ఆరోగ్యశ్రీని రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానించింది. దీంతో 87.5 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ కింద 25 లక్షలకుపైగా శస్త్రచికిత్సలు జరిగాయని పేర్కొంది. ఆ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... రాష్ట్రంలో 57 ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలు, 17 రక్తనిల్వ కేంద్రాలు ఉచితంగా సేవలు అందిస్తున్నాయి.

27 బ్లడ్‌ బ్యాంకుల్లో కాంపోనెంట్‌ సెపరేటర్లు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు కొత్తగా ఇంటిగ్రేటెడ్‌ హాస్పిటల్‌ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ను ప్రవేశపెట్టారు. ఈ విధానంలో భాగంగా డైట్‌ చార్జీలను రెట్టింపు చేసి కొత్త డైట్‌ మెనూను ప్రవేశపెట్టారు. కొత్త ఔషధ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. రూ.61 కోట్ల అంచనా వ్యయంతో 29 బోధనాసుపత్రులు, 20 జిల్లా ఆసుపత్రులు, 30 సామాజిక ఆరోగ్యకేంద్రాల్లో ఎలక్ట్రికల్‌ సేఫ్టీ పనులు సాగుతున్నాయి. రూ.61 కోట్లతో 20 ఆసుపత్రుల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు(ఎస్టీపీ) మంజూరయ్యాయి.

రూ.31 కోట్ల అంచనా వ్యయంతో 153 ఇతర ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ పనులు మంజూరయ్యా యి. 61 ఆసుపత్రుల్లో మార్చురీల మర మ్మతు, పునరుద్ధరణ, అప్‌గ్రేడేషన్‌ పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 12,755 ఖాళీలను భర్తీ చేయడానికి మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్, స్టేట్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్‌కు ప్రభుత్వం అనుమతిచి్చందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో విశ్వాసం, నమ్మకం పెరిగిందని, జాతీయ ఆరోగ్య సూచికల్లో 3వ స్థానానికి చేరుకుందని తెలిపారు.    

మరిన్ని వార్తలు