జాతీయ సమైక్యత ర్యాలీలో అపశ్రుతి

17 Sep, 2022 03:59 IST|Sakshi

మండుటెండతో 30 మంది  విద్యార్థులకు అస్వస్థత 

మంచిర్యాల టౌన్‌/మిర్యాలగూడ అర్బన్‌: మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీలో పాల్గొన్న 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఎండలోనే ఉండటం, తాగునీరు సరిపడా లేక ఇబ్బందులు పడ్డారు. అనంతరం మండుటెండలో ర్యాలీని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వరకు 3 కిలోమీటర్లు నిర్వహించారు. భోజనాలు కూడా ఎండలోనే మైదానంలో కింద కూర్చుని తిన్నారు. కనీసం తాగునీరు అందక, నీడ లేక 30 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 21 మందికి అక్కడే ఉన్న వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించగా, మిగతా 9 మందిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.  

ఎల్‌ఈడీ స్క్రీన్‌ కూలి గాయాలు 
సమైక్యత వారోత్సవాల్లో భాగంగా మిర్యాలగూడలోని వివిధ ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాల విద్యార్థులతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి ఎన్‌ఎస్‌పీ గ్రౌండ్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో కూర్చున్న స్థానిక కాకతీయ పాఠశాల విద్యార్థినులపై ఎల్‌ఈడీ స్క్రీన్‌ కూలిపోయింది. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన విద్యార్థినులకు చికిత్స అందించారు.

ఇదీ చదవండి: ‘జయహో జగదీశన్న’.. ఆ జిల్లా ఎస్పీ నినాదం వివాదాస్పదం!

మరిన్ని వార్తలు