తెలంగాణలో కొత్తగా 3,043 కరోనా కేసులు

24 May, 2021 20:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,043 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 21 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 4,693 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,13,968కి చేరింది. రాష్ట్రంలో కరోనా తొలి దశ, రెండో దశ కలుపుకొని ఇప్పటివరకు మొత్తం 5,56,320 కరోనా కేసులు నమోదు కాగా,  3,146 మంది మృత్యువాత పడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 39,206 యాక్టివ్ కేసులుండగా, ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 424 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆతరువాత ఖమ్మంలో 198, మేడ్చల్‌లో 185, రంగారెడ్డిలో 165, కరీంనగర్‌ 162, నల్లగొండ 159, సూర్యాపేటలో 130 కొత్త  కేసులు నమోదయ్యాయి. 
 

మరిన్ని వార్తలు