వైద్య, ఆరోగ్య శాఖకు 3,977 పోస్టులు!

10 Jul, 2021 03:03 IST|Sakshi

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ కింద నియామకం

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: వైద్య ఆరోగ్య శాఖలో 1,460 కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పోస్టులను ఐదు రోజుల కింద రద్దు చేసిన ప్రభుత్వం.. శుక్రవారం 3,977 పోస్టుల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది. 2022 మార్చి 31 వరకు కొనసాగేలా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన నియామకాలు చేయాలని సూచించింది. ఈ మేరకు స్పెషల్‌ సెక్రటరీ రొనాల్డ్‌ రోస్‌ మూడు వేర్వేరు ఉత్తర్వులను విడుదల చేశారు.

మొత్తం 573 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను మంజూరు చేసిన ప్రభుత్వం వరంగల్‌ కేఎంసీకి 57, ఎంజీఎంకు 27, హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి 3, సీకేఎంకు 4 కేటాయించింది. మిగతావి హైదరాబాద్‌ ఉస్మా నియా, గాంధీ, నిలో ఫర్, డెంటల్‌ ఆస్పత్రులతో పాటు నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, సిద్ది పేట తదితర జిల్లాలకు కేటాయించారు. అన్ని జిల్లాలకు 1,216 మల్టీపర్పస్‌ హెల్త్‌వర్కర్‌ (ఫిమేల్‌) / ఏఎన్‌ఎం పోస్టులు మంజూరు చేశారు. జీఓఆర్‌టీ నం.1040 ప్రకారం 766 స్పెషల్‌ అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్, 115 సివిల్‌ సర్జన్‌ (జనరల్‌), 139 ల్యాబ్‌ టెక్నీషియన్, 119 ఫార్మసిస్టు, 252 ఏఎన్‌ఎం పోస్టు లు, జీఓఆర్‌టీ 1039 ద్వారా 264 సివిల్‌ సర్జన్, 86 ల్యాబ్‌టెక్నీషియన్‌ గ్రేడ్‌–2, 126 ఫార్మసిస్టు గ్రేడ్‌–2 పోస్టులు మంజూరు చేశారు. వీటిని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన నియమిస్తారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు