కృష్ణా నదిలో పుట్టి మునక.. నలుగురు గల్లంతు

17 Aug, 2020 18:39 IST|Sakshi

సాక్షి, నారాయణపేట : జిల్లాలోని మక్తల్ మండలం పసుపుల గ్రామం వద్ద సోమవారం కృష్ణానదిలో పుట్టి మునిగిన దుర్ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రమాదం నుంచి 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. పుట్టిలో ప్రయాణించిన వారు కర్ణాటకలోని కురంగడ్డ ప్రాంతానికి చెందినవారు. నిత్యావసర సరకుల కోసం పంచదేవ్ పాడుకు వచ్చి నదిని దాటుతుండగా వారు ప్రయాణిస్తున్న పుట్టి మునిగింది. గల్లంతైనవారు సుమలత, రోజా, చిన్నక్క, నర్సమ్మగా గుర్తించారు. వీరిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ చేతన ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. (వచ్చిన వరద వచ్చినట్టు దిగువకు)

భారీ వర్షాలతో కృష్ణానదిలో రెండున్నర లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో గల్లంతైన వారి ఆచూకీపై ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇదే ప్రాంతంలో వల్లభాపురం దత్తాత్రేయ స్వామి దర్శనం కోసం నిత్యం భక్తులు పుట్టిల్లోనే ప్రమాదకర ప్రయాణం కొనసాగిస్తుంటారు.

మరిన్ని వార్తలు