విషాదం: ఖమ్మంలో వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతి

13 Mar, 2023 19:46 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల కాలంలో కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతిరోజు ఏదో ఒక మూల వరుస ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఏ వీధిలో చూసిన గుంపులు గుంపులుగా తిరుగుతూ కనిపిస్తున్నాయి. రోడ్లపై వెళ్తున్న పాదచారులు, వాహనాదారుల వెంటపడి తీవ్రంగా కరుస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసి వారి ప్రాణాలను పొట్టన పెంటుకుంటున్నాeయి.

అంబర్‌పేట ఘటన మరవకముందే ఖమ్మం జిల్లాలో కుక్కల దాడిలో మరో బాలుడు మృతి చెందాడు. ఈ విషాదం రఘునాథపాలెం పుఠానితండాలో సోమవారం చోటుచేసుకుంది.  ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు బానోతు భరత్‌(5) పై వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి.. మీదపడి కరవడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. 

గమనించిన తల్లిదండడ్రులు చిన్నారిని ఖమ్మంలోని రెండు, మూడు ఆసుపత్రులకు తీసుకువెళ్లగా సిరియస్‌గా ఉండటంతో ఎవరూ ఆడ్మిట్ చేసుకోలేదు. దీంతో.. చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. కాగా బానోతు రవీందర్, సంధ్య దంపతులకు భరత్‌ చిన్న కుమారుడు. బాలుడు మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని వార్తలు