పాతబస్తీ ఫలక్‌నుమాలో మరో బాలుడు కిడ్నాప్..

30 Sep, 2023 12:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో చిన్నారుల వరుస కిడ్నాప్‌ ఘటనలు కలకలం రేపుతున్నాయి. 24 గంటల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు అపహరణకు గురవ్వడం  తీవ్రం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అయిదేళ్ల బాలుడిని ఇద్దరు కిడ్నాప్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు చేధించారు. బాలుడిని రక్షించి.. ఇద్దరు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు.

ఇంతలోనే పాతబస్తీ ఫలక్ నుమాలో మరో బాలుడు కిడ్నాప్‌ అయ్యాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న 5 ఏళ్ల బాలుడు అయాన్‌ను ఓ అగంతకుడు కిడ్నాప్ చేశాడు. ఇంటి నుండి నడుచుకుంటూ వస్తున్న బాలుడిని వ్యక్తి తీసుకొని వెళ్తునట్టు స్థానిక సీసీటీవీ ఫుటేజీ రికార్డయ్యాయి. కొడుకు కనిపించకపోవడంతో ఫలక్‌నుమా పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అయిదు బృందాలుగా విడిపోయి కిడ్నాపర్‌ కోసం గాలిస్తున్నారు.
చదవండి: HYD: ట్యూషన్‌కు వెళ్లమన్నందుకు బాలిక ఆత్మహత్య 

మరిన్ని వార్తలు