కిలిమంజారోను అధిరోహించిన హైదరాబాద్ బుడతడు

16 Mar, 2021 15:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు మీరు ఏం చేసి ఉంటారు.. మీకు గుర్తుందా..! , ఇది కాస్త కష్టమే. నిన్న చేసిన పనులే అసలు గుర్తుకు ఉండవు అలాంటింది ఏడేళ్ల అప్పుడు అడిగితే ఏం చేప్తామని అనుకుంటున్నారా...! ఎవడికి  తెలుసురా ​ఎవడికి తెలుసు అంటూ  కోపంగా తిట్టుకుంటున్నారా..., పోనీ ఒకవేళ గుర్తున్నా... ఏడేళ్ల వయసులో స్కూలు పోను అంటూ మారం చేస్తూ , అసలు ఆలసట అనేది దరి చేరకుండా ఆడుతూ పాడుతూ ఉంటారు. మనలో  అందరూ  దాదాపు ఇలాగే  చేసి ఉంటారు..

కానీ హైదరాబాద్‌కు చెందిన ఏడేళ్ల విరాట్‌ చంద్ర తేలుకుంట అలా కాదు.. ఈ బుడతడు ఏకంగా ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతం కిలిమంజారో పర్వతాన్ని ఎక్కి అందరితో  ఔరా అనిపించుకున్నాడు. ఫలితంగా కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన పిన్న వయసుడిగా నిలిచాడు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను లెక్కచేయకుండా మార్చి ఆరో తేదీన  కిలిమంజారో  పర్వతాన్ని ఎక్కాడు. ఈ అరుదైన ఘనతను సాధించడంతో తన తల్లిదండ్రులను గర్వించేలాగా చేశాడు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు