మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత 

20 Sep, 2022 02:00 IST|Sakshi

మాగనూర్‌: పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనం తిని 83 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో సోమవారం జరిగింది. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం భోజనం చేయగా దాదాపు 83 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే హెచ్‌ఎం నర్సింహులు, ఉపాధ్యాయులు విద్యార్థులను పీ హెచ్‌సీకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు.

మధ్యాహ్న భోజనం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్య సిబ్బంది స్పష్టం చేశారు. చికిత్స అనంతరం కోలుకున్న విద్యార్థులను ఇళ్లకు పంపించారు. మరో ఏడుగురు విద్యార్థులకు వాంతులు తగ్గకపోవడంతో తల్లిదండ్రులు ప్రైవేట్‌ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. 

మరిన్ని వార్తలు