తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.57 శాతం

19 Oct, 2020 08:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 26,027 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 948 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,23,059 కు చేరింది. వైరస్‌ బాధితుల్లో తాజాగా నలుగురు మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 1275కు చేరింది. కోవిడ్‌ నుంచి కొత్తగా 1,896 మంది కోలుకోవడంతో ఆ సంఖ్య 2,00,686కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,098 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ సోమవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.  (ఫిబ్రవరికల్లా కరోనా కట్టడి..)

ఇప్పటివరకు 38,56,530 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని బులెటిన్‌లో వెల్లడించింది. కరోనా బాధితుల రికవరీ రేటు భారత్‌లో 88.02శాతం ఉండగా.. రాష్ట్రంలో 89.96 శాతంగా ఉందని తెలిపింది. అదే సమయంలో దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతం ఉండగా.. తెలంగాణలో 0.57 శాతంగా ఉందని పేర్కొంది.


 

మరిన్ని వార్తలు