బస్తీ, పల్లె దవాఖానాల్లో  956 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులు

20 Aug, 2022 02:24 IST|Sakshi

మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు 

సాక్షి, హైదరాబాద్‌: బస్తీ, పల్లె దవాఖానాల్లో మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల నియామకాలకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 956 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం అర్హత మార్గదర్శకాలను విడుదల చేసింది. బస్తీ దవాఖానాల్లో ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు ఎంబీబీఎస్‌ లేదా బీఏఎంఎస్‌ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులని స్పష్టం చేసింది.

పల్లె దవాఖానాల్లో (సబ్‌ సెంటర్లు) ఎంబీబీఎస్, బీఏఎంఎస్‌తోపాటు స్టాఫ్‌ నర్సులు అర్హులని పేర్కొంది. బీఎస్సీ నర్సింగ్‌ 2020 తర్వాత పూర్తి చేసిన వారు లేదా 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్‌/జీఎన్‌ఎం సహా ఆరు నెలల కమ్యూనిటీ హెల్త్‌ బ్రిడ్జి కోర్సు (సీపీసీహెచ్‌) పూర్తి చేసిన వారు అర్హులు. వైద్యులకు రూ.40 వేలు, స్టాఫ్‌ నర్స్‌కు రూ.29,900 గౌరవ వేతనం అందిస్తారు.
చదవండి: మునుగోడుకు  క్యూ! 

మరిన్ని వార్తలు