రాజాసింగ్‌పై వందకుపైగా క్రిమినల్‌ కేసులు

3 Nov, 2022 09:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వందకుపైగా క్రిమినల్‌ కేసులున్నాయని, అందులో ఒక హత్య కేసు కూడా ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గతంలో ఆయనపై నమోదైన రౌడీషీట్‌ ఇంకా కొనసాగుతోందని వెల్లడించింది. రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన భార్య టి. ఉషాభాయ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి, జస్టిస్‌ జె.శ్రీదేవి ధర్మాసనం బుధవారం కూడా విచారణను కొనసాగించింది.

ప్రభుత్వ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ హాజరై వాదనలు వినిపించారు. 1860లో ఏర్ప డిన ఉత్తరప్రదేశ్‌లోని ఇస్లామిక సెమినరీ ప్రకారం.. ‘ఆకా’‘మౌలా’అనే పదాలు ప్రవక్తను చూచి స్తాయని చెప్పారు. ఈ సందర్భంగా రాజాసింగ్‌ మాట్లాడిన వీడియో సీడీని కోర్టు అందజేశారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగానే మూడు క్రిమినల్‌ కేసుల ఆధారంగా రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ నమోదు చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు. అనంతరం ధర్మాసనం.. విచారణను గురువారానికి వాయిదా వేసింది.  
చదవండి: నన్ను చంపి బతికి బట్ట కట్టగలమని అనుకుంటున్నారా?.. ఈటల హెచ్చరిక

మరిన్ని వార్తలు