కరీంనగర్‌లో ఈటల రాజేందర్‌కు నిరసన సెగ

16 Apr, 2021 13:51 IST|Sakshi

సాక్షి, కరీంనగర్:‌ మంత్రి ఈటల రాజేందర్‌కు సొంత జిల్లా కరీంనగర్‌లో నిరుద్యోగుల సెగ తగలింది. హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు మంత్రి ఈటల శుక్రవారం వెళ్లారు. ఈ నేపథ్యంలో మంత్రి కాన్వాయ్‌ని ఏబీవీపీ కార్యకర్తలు, నిరుద్యోగులు అడ్డుకుని ఘొరావ్‌ చేశారు. కారుకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని లేకుంటే నిరుద్యోగులకు భృతి  అయినా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన తోపులాటలో ఓ ఏబీవీపీ కార్యకర్త సృహతప్పి పడిపోయాడు. పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

( చదవండి: ప్రతి ఖాళీని భర్తీ చేయాలి ) 

మరిన్ని వార్తలు