నేను ఎప్పుడూ ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తాను : అంజలి‌

27 Mar, 2021 20:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని టాలీవుడ్‌ నటి అంజలి పేర్కొన్నారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ నిబంధనలపై నగర పోలీసులు ఎంజే మార్కెట్‌లో శనివారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ట్రాఫిక్‌ అవగాహనపై సిటీ పోలీసులు, హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో రూపొందించిన మూడు షార్ట్‌ ఫిలిమ్స్‌ను అంజలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. తను ఎల్లప్పుడూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తానని పేర్కొన్నారు. నా డ్రైవర్‌కు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించమని చెప్తానని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు‌ జరిగి ప్రాణాలు పోవడానికి కారణమవుతోందన్నారు.

హైదరాబాద్ ట్రాఫిక్‌, డ్రగ్స్, ఇతర చెడు అలవాట్ల కారణంగా సమాజం ప్రభావితం అవుతుందని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహణ కోసం కార్యక్రమం ఏర్పాటు చేశామని, ప్రతది రోజు రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైవేలపై జరిగే ప్రమాదాలకు అతివేగం కారణమవుతోందని అన్నారు. సినిమాల్లో పోలీసులను విలన్లుగా చూపిస్తున్నారు కానీ బయట పోలీసులు నిజమైన హీరోలని, ప్రతది ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబద్‌ సీపీ అంజనీ కుమార్‌, అడిషనల్‌ సీపీ అనిల్‌ కుమార్‌, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

చదవండి: జాగ్రత్త.. ఇక మీకు మామూలుగా ఉండదు!
 

మరిన్ని వార్తలు