సీఎం హామీల వైఫల్యంపై 30న ధర్నా 

26 Jul, 2021 14:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీలకిచ్చిన హామీల అమల్లో విఫలమైనం దుకు నిరసనగా ఈ నెల 30న ఎస్సీ, ఎస్టీ, బీసీ మోర్చాల ఆధ్వ ర్యంలో ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. దళితబంధు కింద ఎస్టీలకు కూడా రూ.10 లక్షలు ఇవ్వాల్సిందేనని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు డిమాండ్‌ చేశారు.

ఆదివారం పార్టీనేతలు మనోహర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ మోర్చాల నేతలు హుస్సేన్‌నాయక్, కొప్పు బాషా, ఆలె భాస్కర్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడేళ్లుగా ఎస్సీ, ఎస్టీలకు 300 ఎకరాల భూమిని కూడా పంచలేదని విమర్శించా రు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని సీఎం అసెంబ్లీలో ఇచ్చిన మాటను తప్పారన్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు