ఆదిలాబాద్‌: కుప్పకూలిన పెళ్లి కొడుకు.. చికిత్స పొందుతూ కన్నుమూత!

26 Jan, 2023 19:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఆదిలాబాద్‌: మరి కొన్ని గంటల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాల్సి ఉంది. కానీ, విధి ఆ యువకుడి జీవితంతో ఆడుకుంది. కాళ్లకు రాసిన పారాణి ఆరిపోక ముందే అర్ధాంతంరంగా అతని జీవితం ముగిసిపోయింది. రెండు వైపులా కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. 

ఉట్నూరుకి చెందిన సత్యనారాయణకు(34), జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన ఓ యువతితో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఈ నెల 27న అతని వివాహం జరగాల్సి ఉంది. ఆ ఇంటికి పెద్ద కొడుకు కావడంతో పెళ్లి వేడుకలు ఘనంగా చేయాలని భావించారు. సత్యనారాయణే.. తన పెళ్లి పనులు తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి దాకా పనులు చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 

ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. ఆపై అక్కడి నుంచి ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం అతను కన్నుమూసినట్లు తెలుస్తోంది.  కార్డియాక్‌ అరెస్ట్‌తోనే సత్యనారాయణ కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే సత్యనారాయణ.. అదీ వివాహనికి కొద్ది గంటల ముందే కన్నుమూయడంతో ఆ ఊరు ఊరంతా విషాదంలో కూరుకుపోయింది.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు