న్యాయవాదుల హత్య: సీబీఐ విచారణకు డిమాండ్‌

20 Feb, 2021 15:44 IST|Sakshi

హైకోర్టు అడ్వకేట్ జేఏసీ డిమాండ్‌

సాక్షి, పెద్దపల్లి : హైకోర్టు న్యాయవాదలు గట్టు వామన్ రావు నాగమణి దంపతుల దారుణ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టు అడ్వకేట్ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అడ్వకేట్ జేఏసి ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు వామన్రావు దంపతులు హత్యకు గురైన ప్రాంతం రామగిరి మండల కల్వచర్ల  సందర్శించి పరిశీలించారు. వామన్ రావు కుటుంబాన్ని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ కోసం పోరాడిన న్యాయవాదులకు ప్రభుత్వం పై నమ్మకం కలగాలంటే వామన్ రావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.

వామన్ రావు కుటుంబానికి రక్షణ కల్పించి, ఆర్థిక సహాయం అందిచాలని డిమాండ్ చేశారు. అన్యాయాలపై, భూ కబ్జాలపై పోరాడడమే నేరమా అని ప్రశ్నించారు. హత్య వెనుక ఎవరున్నారో బయటపెట్టాలని, వామన్ రావు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు న్యాయవాదులు అంతా గట్టు కుటుంబానికి అండగా ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్‌, న్యాయవాదులు తడకపల్లి సుష్మిత, సౌమ్య, సంధ్య, ఆయేషా, రాజేందర్‌ పాల్గొన్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితులు కుంట శ్రీనివాస్‌ను(ఏ1), చిరంజీవిని (ఏ2), అక్కపాక కుమార్‌(ఏ3)ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కేసులో మరికొన్ని వివరాల కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు.

న్యాయవాదుల హత్య: పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు