పసుపు బోర్డు వచ్చింది.. కాలికి చెప్పులొచ్చాయ్‌..

2 Oct, 2023 12:49 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: రాష్ట్రానికి పసుపు బోర్డు వచ్చే వరకు చెప్పులు వేసుకోబోనని ప్రతిజ్ఞ చేసిన ఓ రైతు 12 ఏళ్ల తర్వాత నిన్న చెప్పులు ధరించాడు. నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలం పాలెం గ్రామానికి చెందిన రైతు ముత్యాల మనోహర్‌రెడ్డి పన్నెండేళ్లుగా పసుపు ఉద్యమంలో పాల్గొంటున్నారు. స్థానికంగా పసుపు బోర్డు ఏర్పాటయ్యే వరకు చెప్పులు వేసుకోబోనని ప్రతినబూనిన ఆయన 2011 నవంబర్‌ 4 నుంచి చెప్పులు వేసుకోవడం లేదు. 2013లో పసుపు బోర్డు కోసం డిమాండ్‌ చేస్తూ కాలికి చెప్పుల్లేకుండానే తిరుపతికి పాదయాత్ర చేశారు.

పసుపు బోర్డు సాధన పోరాటంలో భాగంగా ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద అనేక సార్లు రైతులతో కలిసి ఆందోళనల్లో పాల్గొన్నారు. తాజాగా ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటు విషయాన్ని ప్రకటించడంతో మనోహర్‌రెడ్డి ఆదివారం చెప్పులు వేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పసుపు రైతులు ఆయనను ఘనంగా సన్మానించారు.   

రాష్ట్రానికి పసుపు బోర్డు వచ్చే వరకు చెప్పులు వేసుకోబోనని ప్రతిజ్ఞ చేసిన ఓ రైతు 9 సంవత్సరాల తర్వాత నిన్న చెప్పులు ధరించాడు. నిజామాబాద్‌లో పుసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. బోర్డు కోసం పలుమార్లు ఉద్యమాలు కూడా జరిగాయి. తాజాగా మహబూబ్‌నగర్‌లో పర్యటించిన మోదీ పసుపు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో జిల్లా రైతులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు