తెలంగాణలో కొనసాగుతున్న రాహుల్‌ ‘భారత్‌జోడో యాత్ర’

27 Oct, 2022 13:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన ‘భారత్‌జోడో యాత్ర’ గురువారం నుంచి రాష్ట్రంలో పునః ప్రారంభమైంది. ఉదయం 6:30 గంట లకు నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజక వర్గ కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద యాత్రను ప్రారంభించారు రాహుల్‌. ఉదయం నడకలో భాగంగా అక్కడి నుంచి కన్యకా పరమేశ్వరిఆలయం, పెద్దచెరువు, దండు క్రాస్, గొల్లపల్లి క్రాస్‌రోడ్డు, కచ్వార్‌ గ్రామం మీదుగా 12 కిలోమీటర్లకు పైగా నడిచి జక్లె్తర్‌ గ్రామా నికి చేరుకున్నారు.

యెలిగండ్లలో బస..
అక్కడ మధ్యాహ్నం బస చేసిన తర్వాత సాయంత్రం 4గంట లకు మళ్లీ పాదయాత్రను ప్రారంభించి జక్లె్తర్‌ క్రాస్‌రోడ్డు, గుడిగండ్ల మీదుగా 14.5 కి.మీ. ప్రయాణించి యెలిగండ్ల గ్రామానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం మళ్లీ అక్కడి నుంచే మూడో రోజు పాదయాత్రను కొనసాగిస్తారు. ఈ యాత్ర నవంబర్‌ 7 వరకు రాష్ట్రంలో జరగనుంది. ఉమ్మడి మహ బూబ్‌నగర్, రంగారెడ్డి, హైద రాబాద్, మెదక్, నిజామాబాద్‌æ జిల్లాల్లో పాద యాత్ర సాగనుంది. ఏ రోజుకారోజు యాత్ర ముగిసిన ప్రదేశంలోనే ఆయన బస చేయను న్నారు. కాగా,నవంబర్‌ 4న ఆయన యాత్రలో మరోమారు విరామం తీసుకుంటారు.

మూడు రోజుల విరామం తర్వాత
ఈనెల 23న కర్ణాటక నుంచి నారాయణ పేట జిల్లా కృష్ణా మండలం గూడేబల్లేరు గ్రామానికి రావడం ద్వారా తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్‌ మొదటిరోజు యాత్ర తర్వాత దీపా వళి విరామం తీసుకున్నారు. ఈనెల 24, 25, 26 తేదీల్లో ఢిల్లీలో ఉన్న ఆయన 27 నుంచి జరిగే యాత్రలో పాల్గొ నేందుకు బుధవారం అర్ధరాత్రి దాటాక గూడేబల్లేరు సమీపంలోని టైరోడ్‌ జంక్షన్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఆయన రోడ్డు మార్గంలో టైరోడ్‌ జంక్షన్‌కు వెళ్లారు. ఉదయం 6:30 గంటలకు ప్రారంభం కానున్న రెండో రోజు పాద యాత్రలో పాల్గొనేందుకు ఆయన 5 గంటల సమయంలో మక్తల్‌కు చేరుకుంటారు.

దేశ రాజకీయాల్లో మార్పు
రాహుల్‌గాంధీ యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రెండోరోజు ఆయన నడిచే దారిపొడవునా పెద్దఎత్తున ప్రజలు పాల్గొంటారు. రాహుల్‌ భారత్‌ జోడో యాత్రతో దేశ రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ప్రజలు ఆయన్ను అక్కున చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. రాహుల్‌ రాకతో పాలమూరు రాజకీయ సమీకరణాలు తారుమారవుతాయి.   
– ఎస్‌.సంపత్‌కుమార్, ఏఐసీసీ కార్యదర్శి 

మరిన్ని వార్తలు