భర్త చనిపోయిన 11 నెలలకు..  ఐవీఎఫ్‌ పద్ధతిలో మగశిశువుకు జన్మనిచ్చిన మహిళ

8 Apr, 2022 18:08 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: వారికి పెళ్లై తొమ్మిదేళ్లయ్యింది. పిల్లలు లేకపోవడంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. చివరికి ఐవీఎఫ్‌ పద్ధ తిలో గర్భం కోసం భార్యాభర్తలి ద్దరూ తమ కణాలను కూడా భద్ర పరిచారు. దురదృష్టవ శాత్తు భర్త కోవిడ్‌తో మరణించారు. ఆయన జ్ఞాపకమైన బిడ్డ కోసం భార్య హైకోర్టుకు వెళ్లారు. కోర్టు అనుమతి తెచ్చుకుని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ అరుదైన ఘటన వరంగల్‌లో చోటుచేసు కుంది.

వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లాలో ఫ్యూరిఫైడ్‌ వాటర్‌ వ్యాపారం చేసుకుంటున్న కుమార్‌(32), ప్రేమ(పేరు మార్చాం)లకు తొమ్మిదేళ్ల క్రితం పెళ్లైంది. కానీ పిల్లలు లేకపోవడంతో... 2020లో వరంగల్‌లోని ఒయాసిస్‌ ఫెర్టిలిటీ సెంటర్‌ను సంప్రదించారు. ఫెర్టిలిటీ సెంటర్‌ స్పెషలిస్ట్, క్లినికల్‌ హెడ్‌ డాక్టర్‌ జలగం కావ్యరావు పర్యవేక్షణలో ఐవీఎఫ్‌ చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమె అండం, అతని శుక్రకణాలను భద్రపరిచారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో కుమార్‌కు పాజిటివ్‌ వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విష మించడంతో చనిపోయాడు.
చదవండి: టెన్త్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం

ఐవీఎఫ్‌ విధా నంలో పిండ మార్పిడికి భార్యా భర్తలిద్దరి సమ్మతి అవసరం. భర్త చనిపోయిన కారణంగా సమ్మతి కుదరదు కాబట్టి, గత తీర్పులను ఉటంకిస్తూ, ప్రేమ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు... ఫ్రీజింగ్‌ చేసిన కణాల ఫలదీకరణ, పిండ మార్పిడికి ప్రేమకు అనుమతి ఇచ్చింది. దీంతో ఒయాసిస్‌ ఫెర్టిలిటీ సెంటర్‌ వారు ఫ్రోజెన్‌ యాంబ్రియో ట్రాన్స్‌ఫర్‌ ద్వారా ఆమెలోకి పిండం పంపారు.

మార్చి 22న ప్రేమ మగ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లే కుండా పోయాయి. వరంగల్‌ ఒయాసిస్‌ ఫెర్టిలిటీ క్లినికల్‌ హెడ్‌–ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ జలగం కావ్యరావు మాట్లాడుతూ.. విధి ఆమెకు అపార మైన నష్టం కలిగించినా, అధునాతనమైన సంతానోత్పత్తి ప్రక్రియతో ప్రేమ జీవితంలో కొత్త ఆశలను చిగురింపచేయగలిగామని అన్నారు. 

మరిన్ని వార్తలు