కరోనా సోకిన వెంటనే ఆస్పత్రిలో చేరాలా? 

30 Apr, 2021 17:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ బారిన పడిన వెంటనే ఆస్పత్రిలో చేరాలా అంటే అవసరం లేదు అంటున్నారు నిపుణులు. కోవిడ్‌ కేసులను మైల్డ్, మోడరేట్, సీరియస్‌ అంటూ మూడు రకాలుగా విభజించారు. సాధారణంగా మనిషి రక్తంలో ఆక్సిజన్‌  శాచురేషన్‌ 99 నుంచి 100 శాతం ఉంటుంది. ఆక్సిజన్‌ లెవల్స్‌ 95కు పైన ఉండి, పెద్దగా కరోనా లక్షణాలు లేనివారిని మైల్డ్‌ కేసులుగా పరిగణిస్తారు. వీరికి ఆస్పత్రిలో చికిత్స అవసరం లేదు. ఇంట్లోనే ఉండి, వైద్యులు సూచించే మందులు వాడితే సరిపోతుంది. ప్రస్తుతం 85 శాతం నుంచి 90 శాతం మంది హోం ఐసోలేషన్‌లోనే ఉండి కోలుకుంటున్నారు.

ఇక ఆక్సిజన్‌ శాచురేషన్‌ 94 శాతంకన్నా తక్కువగా, రెస్పిరేటరీ రేట్‌ 24–25 శాతం ఉన్నవారు, శరీర ఉష్ణోగ్రత 101 ఫారన్‌హీట్‌కి పైగా ఉన్నవారు మాత్రమే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవాలి. వీరిలో 10-15 శాతం మందికి మాత్రమే రెమిడెసివిర్, ప్లాస్మా థెరపీ వంటి చికిత్సలు అవసరమవుతాయి. మిగతావారు సాధారణ చికిత్సతోనే కోలుకుంటారు. ఆక్సిజన్‌ లెవల్స్‌ 80 శాతాని కంటే తగ్గి.. ఊపిరాడని పరిస్థితుల్లో ఉన్నవారిని సీరియస్‌ కేసులుగా భావిస్తారు. అలాంటి వారు మొత్తం పాజిటివ్‌ వారిలో 5 శాతం కంటే తక్కువే ఉంటారు. వీరికి ఖరీదైన మందులు, వెంటిలేటర్‌ చికిత్సలు అవసరం. డా.భాస్కర్‌రావు, తెలంగాణసూపర్‌ స్పెషాలిటీహాస్పిటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

చదవండి: కరోనా: బాధను పంచుకుంటే తప్పేంటి? సుప్రీం ఫైర్‌

మరిన్ని వార్తలు