కాళేశ్వరం: అన్నారం సరస్వతి బ్యారేజీకి లీకేజీలు

1 Nov, 2023 11:40 IST|Sakshi

సాక్షి, జయశంకర్ భూపాలపల్లి:  మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఘటన మరిచిపోక ముందే.. మరొకటి వార్తల్లోకి ఎక్కింది. అన్నారం సరస్వతి బ్యారేజీకి లీకేజీలు చోటు చేసుకోవడంతో అధికార యంత్రాగం అప్రమత్తమైంది. 

బ్యారేజీలో 28, 38 నంబర్ గల రెండు గేట్ల వద్ద లీకేజీతో నీరు ఉబికి వచ్చింది. అప్రమత్తమైన ఇంజనీరింగ్ అధికారులు  ఇసుక సంచులు వేసి ఊటలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీలో 5.71 టిఎంసీల నీరు ఉండగా.. ఒక గేటు ఎత్తి 2,357 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు సమాచారం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 10.87 టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో అన్నారం సరస్వతి బ్యారేజ్ నిర్మించారు.

మరిన్ని వార్తలు