అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి

17 Jun, 2022 14:58 IST|Sakshi

ఆర్మీని ప్రైవేటీకరించడం కోసమే అగ్నిపథ్

రాకేష్ మరణానికి కేంద్రమే కారణం

గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలి

రాకేష్ కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలి

మధు యాష్కీ గౌడ్‌ డిమాండ్‌

హైదరాబాద్‌: దేశ భద్రతకు వెన్నుముకలా నిలిచిన మిలటరీని ప్రైవేటీకరించే సన్నాహాల్లో భాగంగా తీసుకువస్తున్న అగ్నిఫథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ గౌడ్ డిమాంఢ్‌ చేశారు.  సికింద్రాబాద్ లో జరిగిన యువకుల ఆందోళనల్లో భాగంగా పోలీసులు కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు మరణించడం అత్యంత దిగ్భ్రాంతిని కలిగించిందని, రాకేష్‌ మరణానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాకేష్ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని వెంటనే ప్రకటించాలన్నారు.

మధు యాష్కీ గౌడ్‌ ఇంకా ఏమన్నారంటే..

➖ఒన్ ర్యాంక్ ఒన్ ఫెన్షన్ పథకానికి మంగళం పాడేలా నో ర్యాంక్.. నో ఫెన్షన్ పథకం అమలు చేయడంలో భాగంగా అగ్నిపథ్ కేంద్రం తీసుకువస్తోంది. మిలట్రీని ప్రైవేటీకరించడంతో పాటు,  సైనిక విభాగాల్లో జీతభత్యాలు, ఇతర ఖర్చలు తగ్గించుకోవాలన్న దుర్మార్గమైన ఆలోచనతోన కేంద్రం  ఈ పథకం తీసుకువస్తోంది. దీనిని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. 

➖కరోనా కాలంనుంచి ఆర్మీలో రిక్రూట్ మెంట్ కోసం యువత ఎదురుచూస్తోంది. రెగ్యులర్ రిక్రూట్ మెంట్ చేయకుండా కాంట్రాక్ట్ ప్రాతిపదికన అగ్నిపథ్ పేరుతో రిక్రూట్ మెంట్లు చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. 

➖సికింద్రాబాద్ లో శాంతియుతంగా నిరసన చేస్తున్న యువతపై పోలీసులు లాఠీఛార్జీ, కాల్పులు జరపడం అత్యంత అమానుషం. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. 

➖కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా యువకుల సహనాన్ని ఇంకా పరీక్షించకుండా వెంటనే రిక్రూట్ మెంట్ మొదలు పెట్టాలి. 

మరిన్ని వార్తలు