హైదరాబాద్‌ పోలీసుల అదుపులో ఆవుల సుబ్బారావు

21 Jun, 2022 20:55 IST|Sakshi

సాక్షి, గుంటూరు: అగ్నిపథ్‌ను నిరసిస్తూ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లరు, విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్‌ అకాడమీ అధినేత ఆవుల సుబ్బారావును తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసరావు పేట సాయి ఢిపెన్స్‌ అకాడమీ నుంచి ఆవుల సుబ్బారావుని పోలీసులు హైదరాబాద్‌ తీసుకెళ్లారు. సికింద్రాబాద్‌ అటాక్‌లో సాయి డిఫెన్స్‌ అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు.

అ‍ల్లర్లలో 10 బ్రాంచ్‌ల విద్యార్థులున్నట్లు పోలీసులు గుర్తించారు. అభ్యర్థులను రెచ్చగొట్టడంతోపాటు ఉదంతం జరగడానికి ముందు రోజు రాత్రి సికింద్రాబాద్‌ వచ్చాడని, ఘటన జరిగిన రోజు కొన్ని గంటలు అక్కడే ఉన్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. ఈ మేరకు సికింద్రాబాద్‌ అల్లర్ల కేసులో బుధవారం నుంచి సుబ్బారావును హైదరాబాద్‌ పోలీసులు విచారించనున్నారు. 

చదవండి: (అగ్నిపథ్‌ స్కీమ్‌పై ఎంపీ అసదుద్దీన్‌ కీలక వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు