తెలంగాణలో వ్యవసాయ విద్యుత్‌ కోతలు షురూ

14 Apr, 2022 18:40 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో తాజాగా విద్యుత్ కోతలు మొదలయ్యాయి. డిమాండుకు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరగడం, సరిపోయేంత కరెంటు నిల్వలు లేకపోవడం, కొనుగోలు సమస్య ఉండటంతో వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరాలో కోతలు విధిస్తున్నారు. రాత్రిపూట సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్‌ మాత్రమే సరఫరా చేయనున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా త్రీఫేజ్‌విద్యుత్‌కు సంబంధించి షెడ్యూల్‌ను ప్రకటించారు.

మరో పది రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏ రోజుకు ఆరోజు విద్యుత్‌ సరఫరా వేళలను అధికారులు ప్రకటించనున్నారు. కాగా, యాసంగి పంటలు కోతకు వచ్చే సమయంలో పగటిపూట 7 గంటలు మాత్రమే విద్యుత్‌ సరఫరా చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

మరిన్ని వార్తలు