నిన్ను నమ్ముకొని బతుకుతున్నాం.. మా బతుకెట్ల బిడ్డో.. 

15 Jun, 2021 07:43 IST|Sakshi

మృతిచెందిన ఎద్దు వద్ద గుండెలు బాదుకున్న రైతు దంపతులు 

బయ్యారం: ‘బిడ్డా నిన్ను నమ్ముకొని బతుకుతున్నాం.. నీవు ఇట్లా ఎళ్లిపోతే మేము బతికేదెట్టా..’అంటూ రైతు దంపతులు విద్యుదాఘాతంతో మరణించిన తమ కాడెద్దు వద్ద విలపించిన తీరు పలువురిని కన్నీటి పర్యంతం చేసింది. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం ఇసుకమేది గ్రామానికి చెందిన సోలం నర్సింహారావు, కృష్ణవేణి దంపతులకు రెండెకరాల భూమి ఉంది.

ఈ భూమిని తమ రెండు కాడెడ్లతో సాగు చేస్తారు. అయితే, ఆ రెండు కాడెడ్లలో ఒకటి సోమవారం ఉదయం విద్యుదాఘాతంతో మృతి చెందింది. కాగా, ఇదేచోట మరో నలుగురు రైతులకు చెందిన ఎద్దులు కూడా మృతి చెందాయి. 

రాష్ట్రంలో మరో  రెండ్రోజులు వర్షాలు 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో రెండ్రోజు లు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం దక్షిణ జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నట్లు తెలిపింది. దీనికి అనుబంధంగా మధ్య ట్రోపోస్ఫియర్‌ వరకు ఉపరితల ఆవర్త నం వ్యాపించి ఉందని, ఎత్తుకెళ్లే కొద్దీ అల్పపీడ నం నైరుతిదిశగా తెలంగాణ వైపునకు ఉన్నట్లు తెలిపింది.

ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉన్న ట్లు వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందంది. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అంచనా వేసింది.
చదవండి: పోస్ట్‌ కోవిడ్‌లో కొత్తరకం సమస్య.. ‘వైరల్‌ ఆర్‌థ్రాల్జియా’

మరిన్ని వార్తలు